అందుబాటులోకి మరో 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలు
రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను ప్రారంభించిన జేపీ నడ్డా.
రూ.249 కోట్ల వ్యయంతో 22 ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు. క్రిటికల్ కేర్ యూనిట్ల ద్వారా అందుబాటులోకి వచ్చిన 500 క్రిటికల్ కేర్ బెడ్లు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్యంలో మెరుగైన సేవలు అందించడం.. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టం తప్పించేలా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం.
