విజయవాడ old జిజిహెచ్ లోని నూతన క్రిటికల్ కేర్ బ్లాక్ లోని ఎక్విప్మెంట్ ను friday night పరిశీలిస్తున్న మంత్రి సత్య కుమార్.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలను మంజూరు చేసిందని, వీటి కోసం రూ.600.35 కోట్లు కేటాయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, మూడు జిల్లా ఆసుపత్రులు, ఐదు ప్రాంతీయ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.మొత్తం 24 కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్స పడకలు సమకూరతాయని వివరించారు. వీటిలో 22 కేంద్రాల్లో ఒక్కొక్కదానిలో 50 పడకలు, ఒక కేంద్రంలో 75, మరో కేంద్రంలో 100 పడకలు ఉంటాయని తెలిపారు.ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్స కేంద్రాలు రేపటి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటి కోసం రూ.234.50 కోట్లు ఖర్చు చేసి 500 అదనపు పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతోపాటు, వ్యాధులను తొలిదశలోనే గుర్తించి నియంత్రించేందుకు రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు 22 ప్రాజెక్టుల్లో రూ.234.50 కోట్లతో నిర్మించిన 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *