మెటబాలిక్ హెల్త్ అండ్ డయాబెటిస్ మేనేజ్మెంట్

 

జన విజ్ఞాన వేదిక (JVV)ఆధ్వర్యంలో డాక్టర్ భారతి గారు (ఎండోక్రైనాలజిస్ట్) ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. 

సబ్జెక్ట్ : మెటబాలిక్ హెల్త్ అండ్ డయాబెటిస్ మేనేజ్మెంట్

మెటబాలిక్ హెల్త్ అంటే ఏమిటి?
మెటబాలిక్ హెల్త్ అనేది కేవలం షుగర్ ఒక్కటే కాదు; రక్తపోటు (BP), కొలెస్ట్రాల్, శరీర బరువుతో పాటు నడుము కొలతపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ భారతి వివరించారు.
* ముందస్తు హెచ్చరికలు: మెడ చుట్టూ నల్లటి మచ్చలు రావడం (Acanthosis Nigricans), తిన్న వెంటనే విపరీతమైన నీరసం రావడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంకేతాలు.
* నడుము కొలత: మహిళల్లో 80 సెం.మీ, పురుషుల్లో 90 సెం.మీ కంటే తక్కువ ఉండాలి.

“ప్లేట్ మెథడ్” – ఆహారం తినే విధానం

  • మనం ఏం తింటున్నాం అనే దానికంటే, ఎలా తింటున్నాం అనేది ముఖ్యం. ప్లేట్‌ను మూడు భాగాలుగా విభజించుకోవాలి:
  • 50% పీచు పదార్థం (Fiber): సగం ప్లేట్ ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ లేదా మొలకలతో నిండాలి.
  • 25% ప్రోటీన్ (Protein): గుడ్డు తెల్లసొన, సోయా, పప్పు ధాన్యాలు లేదా పన్నీర్ ఉండాలి.
  •  25% కార్బోహైడ్రేట్లు (Carbs): మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం, ఇడ్లీ లేదా దోశ ఉండాలి.
    ముఖ్య సూచన: ముందుగా కూరగాయలు, ప్రోటీన్ తిన్న తర్వాతే అన్నం తినాలి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగవు.

అపోహలు – వాస్తవాలు

  • బెల్లం మరియు తేనె: షుగర్‌కు బదులు బెల్లం వాడటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. బెల్లం కూడా షుగర్ లాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.
  • కొర్రలు (Millets): కొర్రలు ఆరోగ్యకరమే కానీ, అవి కూడా కార్బోహైడ్రేట్లే. కాబట్టి వాటిని కూడా పరిమితంగానే తినాలి.
  • నూనె వాడకం: నెలకు ఒక వ్యక్తికి అర కిలో (0.5kg) కంటే ఎక్కువ నూనె వాడకూడదు.

 వ్యాయామం: కేవలం వాకింగ్ సరిపోదు
స్ట్రెంత్ ట్రైనింగ్: కేవలం నడక వల్ల కండరాలు పెరగవు. బరువులు ఎత్తడం లేదా కండరాలకు పని చెప్పే వ్యాయామాలు (Strength Training) చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది.
తీవ్రత: వ్యాయామం చేసేటప్పుడు గుండె వేగం పెరగాలి. అప్పుడే కొవ్వు కరుగుతుంది.
కదలిక: గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా, ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు నడవాలి.

డయాబెటిస్ రివర్సల్ vs రెమిషన్
డయాబెటిస్ పూర్తిగా పోవడం (Reversal) అనేది ఒక అపోహ. క్రమశిక్షణతో కూడిన ఆహారం, వ్యాయామం ద్వారా మందులు లేకుండా షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచడాన్ని “రెమిషన్” (Remission) అంటారు.
షుగర్ వచ్చిన మొదటి 6 ఏళ్లలోపు ఉన్నవారు దీనిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చేయించుకోవాల్సిన పరీక్షలు
షుగర్ ఉన్నా లేకపోయినా ఈ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు:
HbA1c: 3 నెలల సగటు షుగర్ లెవల్.
Fasting Insulin: ఖాళీ కడుపుతో ఇన్సులిన్ స్థాయిని చూడటం.
HOMA-IR: మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి.

డాక్టర్ భారతి ఎండో క్రైనాలజిస్ట్

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *