పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యకుమార్

బోధకాలు నివారణ కార్యక్రమం ప్రారంభం

రాష్ట్రంలో బోధకాలు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి  సత్యకుమార్

బోధకాలు (పైలేరియా) నివారణ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి మాత్రల పంపిణీ కార్యక్రమం జాతీయ స్థాయిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా 124 జిల్లాల్లో (710 బ్లాక్లు) ఎంపికచేసిన ప్రాంతాల్లో బోదకాలు నివారణ కోసం మాత్రలను పంపిణీ చేయనున్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నుంచి వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు.

1,31,229 మందికి

రాష్ట్రంలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గుర్ల, బలిజపేట మండలాల్లో నివాసం ఉండే 1,31,229 మందికి డీఈసీ, అల్బండజోల్ మాత్రలను ఇవ్వనున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ మాత్రలను కేసులు అధికంగా గుర్ల, బలిజపేట మండలాల్లో నివాసం ఉండే వారికి ఇస్తారు. మైక్రో ఫైలేరియా ప్రభావం ఒక శాతం కంటే ఎక్కువగా ఉన్నందున ఈ మండలాల్లో మాత్రలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు మండలాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో కలిపి 480 పైలేరియా కేసులు (పూర్వ) ఉన్నాయి మంత్రి శ్రీ సత్యకుమార్ ప్రారంభించిన మాత్రల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు పద్మావతి, అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణేశ్వరి, జాయింటు సంచాలకులు మల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *