-ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
-ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి!
నీటి లో క్లోరినేషన్ తీరును పరిశీలించాలి
-స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
కుక్కకాట్ల వల్ల జరిగిన మరణాలకు దారితీసిన కారణాలపై ఆడిట్ జరగాలి
-కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ
-రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ
“దోమలను పుట్టకుండా (యాంటీ లార్వా ఆపరేషన్), కుట్టకుండా (యాంటీ అడల్ట్) చర్యలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని హైదరాబాదులోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ సూచించారు. ఈ విధానాన్ని పకడ్బందీగా, ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తే కీటకజనిత వ్యాధులను నియంత్రించేందుకు సాధ్యమవుతుందని వెల్లడించారు అంటు వ్యాధుల (డెంగీ, మలేరియా, టెఫాయిడ్, ఇతర) నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, సలహాలు, సూచనల కోసం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఆదేశాల మేరకు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు తొలి సమావేశం ‘వర్చువల్ విధానంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో కుక్కలకాటువల్ల జరిగిన మరణాలపై అధ్యయనం చేయాలని సూచించారు. స్క్రబ్స్టేఫస్ జ్వరాలపట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, పొలం పనులు ముగించుకుని వచ్చిన వారు వెంటనే దుస్తులను మార్చుకోవాలని సూచించాలన్నారు నీటిలో క్లోరినేషన్ చేసేతీరును తరచూ సదరు పర్యవేక్షణ అధికారులు నేరుగా పరిశీలించడం ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు చిన్నారులు కుష్ఠు వ్యాధులబారిన పడడానికి దారితీస్తున్న కారణాలపై పరిశీలన చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, అగ్రికల్చర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ర్యాపిడ్ రెస్పాన్స్ టీములో భాగస్వాములను చేయాలి ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు ఉంటాయి” అని పేర్కొన్నారు.
జాయింటు ఇన్స్పెక్షన్లు చేయాలి!
ప్రెసిడెంటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా డాక్టర్ రంగారెడ్డి మాట్లాడుతూ “విద్యార్థులు ఉండే వసతి గృహాల్లోని పరిస్తితులను ఎప్పటికప్పుడు నేరుగా తనిఖీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖలు, పంచాయతీ, మున్సిపల్, ఇతర సదరు శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీలు తొలుత 15 రోజులకు, ఆ తరువాత నెలకొకసారి, పరిస్థితులు అదుపులోనికి వచ్చిన అనంతరం మూడు నెలలకొకసారి సంయుక్తంగా తనిఖీలు చేయాలి. తనిఖీలకు ముందు ఏయే అంశాలను నిశితంగా పరిశీలించాలో (చెక్ లిస్టు) తయారుచేసుకోవాలి. వీటికి అనుగుణంగా నిశిత పరిశీలన జరుగుతుంటే వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆయా ప్రాంతాల్లోని కేసుల నమోదు ((హాటుస్పాట్సుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి ఈ ప్రాసెస్ ప్రతి ఏడాది నిరంతరం జరుగుతుండాలి. అవుటు బ్రేక్స్ రిపోర్టులపై విశ్లేషణ జరగాలి స్క్రబ్స్టేఫస్ జ్వరాలవంటి వాటిపై వైద్య సిబ్బంది, అనుసంధానంగా ఉండే ఇతర శాఖల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
ఫీవర్ క్లినిక్కులు నిర్వహించాలి!
కర్ణాటకలోని కస్తూర్బా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ HOD చిరంజయ్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ “ప్రస్తుత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది తురకపాలెంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్కులు ముఖ్యంగా వర్షాకాలానికి ముందుగానే నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, జ్వరాలపట్ల అప్రమత్తం చేయాలి. దీనివల్ల జ్వరాల నియంత్రణ (అవుటు బ్రేక్)కు సాధ్యమవుతుంది. ఆధునిక సౌకర్యాలతో ల్యాబుల సామర్థ్యాన్ని పెంచాలి. దీనివల్ల సదరు ప్రాంతాల్లో సేకరించే నమూనాలను పరీక్షించేందుకు వీలవుతుంది’ అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఎన్.సి.డి.సి.) అడిషనల్ డైరెక్టర్ హిమాన్షుచౌహన్ రాష్ట్ర కమిటీ ఏర్పాటును స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కుష్టువ్యాధి నిపుణులు డాక్టర్ నరసింహారావు కూడా మాట్లాడిన వారిలో ఉన్నారు.
”తురకపాలెం” జునోటిక్ పరీక్షల రిపోర్టులు ‘నెగిటివ్!
రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ముఖ్య అధికారి మాట్లాడుతూ బ్రూసెల్లోసిస్ అనే జునోటిక్ (జంతువులు నుంచి మనుషులకు వ్యాప్తిచెందే) వ్యాధికి సంబంధించి సిరో మానిటరింగ్, సిరో సర్వైలెన్స్ చేస్తున్నామన్నారు జంతువుల్లో లెప్టోస్పైరోసిస్ తీవ్రత గుర్తించేందుకు టెస్టింగ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 2,061 నమూనాలను పరీక్షించామని తెలిపారు. తురకపాలెంలో జునోటిక్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చాయన్నారు మున్సిపల్ శాఖ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు లక్షల వీధి కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ చేశామన్నారు. 39 కుటుంబ నియంత్రణ కేంద్రాలను నడుపుతున్నామన్నారు.
చర్యలు తీసుకుంటాం:వీరపాండియన్
చివరిగా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ తొలి టాస్క్ ఫోర్సు సమావేశంలో చర్చించిన మేరకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి, అదనపు, సంయుక్త సంచాలకులు, వైద్యులు సుబ్రహ్మణ్యేశ్వరి, మల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు టాస్క్ఫోర్సు కమిటీ ఏర్పాటును ఆహ్వానించారు.


