మధుమేహంపై కర పత్రం ఆవిష్కరణ సభలో డాక్టర్ ఎస్. ఎస్ .వి .రమణ
దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మధుమేహం నిరోధంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎస్. ఎస్. వి .రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక 2/1 బ్రాడీపేట లోని ఎస్ .హెచ్ .ఓ .సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నవంబర్ నెల-“మధుమేహం నిరోధక మాసం “సందర్భంగా ప్రచురించిన మధుమేహం- కారణాలు -లక్షణాలు -నిర్ధారణ పరీక్షలు -చికిత్స విధానాలు -నిరోధక మార్గాలు తదితర అంశాల పైన , నవంబర్ నెలలో ఎస్ .హెచ్. ఓ. లో నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరాలు, శాస్త్రీయ అవగాహన సభల సమాచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్ సారధ్యం వహించారు .ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. ఎస్. వి .రమణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ వయస్సుతో నిమిత్తం లేకుండా మధుమేహంపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందన్నారు.
ఎన్నారై వైద్యులు డాక్టర్ రాజా మాట్లాడుతూ అమెరికా వంటి దేశాలలో మధుమేహ చికిత్సకు చాలా ఖర్చవుతుంది అన్నారు. అయితే మనదేశంలో అయ్యే ఖర్చు కంటే కూడా అతి తక్కువ ఖర్చుకే సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ,వ్యాధి నిర్ధారణ పరీక్షలు ,మందులు అందించడం హర్షనీయమన్నారు.సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, డాక్టర్ టీ .సేవకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు అత్యంత తక్కువ ఖర్చుకే కంప్లీట్ హెల్త్ చెకప్- డయాబెటిక్ ప్రొఫైల్ పరీక్షలు అందిస్తున్నామన్నారు. ఈ ప్రొఫైల్లో విటమిన్ డి ,విటమిన్ బి12 ,ఐరన్ ,కిడ్నీ, లివర్, లిపిడ్ ,థైరాయిడ్ ,హెచ్ బి ఎ1సి వంటి ప్రధాన పరీక్షలతో పాటు మొత్తం 86 పరీక్షలు ఉంటాయన్నారు .పరీక్షలు చేయించుకున్న వారికి ఉచిత వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు .జిల్లాలో మధుమేహం నిరోధమే లక్ష్యంగా శాస్త్రీయ అవగాహన సదస్సులు , సమావేశాలు నిర్వహించదలచిన వారు 2/1 బ్రాడీపేట లోని ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో సంప్రదించవచ్చునన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి .ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ మధుమేహం నేడు ఒక ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది అని , ప్రజలందరూ ఈ అనారోగ్య సమస్యపై దృష్టి సారించాలన్నారు. మధుమేహం నిరోధమే లక్ష్యంగా ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కలిగించాలని నవంబర్ నెల అంతా అనేక శాస్త్రీయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలోఎస్ .హెచ్ .ఓ. మేనేజర్ పి .నిర్మల రాణి,జి.వి. ఎస్ . ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .


