- వైద్య పరికరాలు, మందులు, ఇతర అవసరాల కోసం
- 2023-24 కంటే 2024-25 సెప్టెంబరు నాటికి పెరిగిన ఓ.పి, ఐ.పి సేవలు
- మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి
- యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి పిలుపు
రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాలు (డీ-ఆడిక్షన్ సెంటర్స్) బలోపేతానికి రూ.33.80 కోట్లు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.రాష్ట్రంలో జిల్లా, బోధనాసుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్య పరికరాలు, మందులు,మౌళిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థ మెరుగుపరచడం,
సిబ్బందికి ప్రోత్సాహకాలు ,అవగాహన కార్యక్రమాలు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నుండి ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.21 కేంద్రాల ద్వారా వ్యసనల బారినపడినవారిని ఆ వ్యసనాలు నుండి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జరుపుకునే జాతీయ మాదకద్రవ్య వ్యసన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి.చెడు సహవాసలు చేయవద్దు, ఆరోగ్య సంరక్షణ, విలువలు ముఖ్యమని పేర్కొన్నారు.ఈ విమోచన కేంద్రాల ద్వారా వ్యసనాలకు గురైనవారికి నిపుణులు ద్వారా చికిత్స , ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నాము.ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం వ్యసనాలకు గురైనవారికి కొత్త జీవితం ప్రసాదించడమని తెలిపారు.
పెరిగిన ఓ.పి, ఐ.పి
2023-24లో 18,147 మంది ఇన్-పేషెంట్లు మరియు 1,65,028 మంది అవుట్-పేషెంట్లు సేవలు పొందగా,2024 నుంచి సెప్టెంబర్ 2025 నాటికే అత్యధికంగా 22,909 మంది ఇన్-పేషెంట్లు మరియు 1,30,513 మంది అవుట్-పేషెంట్లు ఈ కేంద్రాల ద్వారా సేవలు పొందారు.
కేంద్రం నుండి నిధులు
మత్తు పదార్థాల వినియోగం కుటుంబాలను, సమాజాన్ని, ముఖ్యంగా యువతను నాశనం చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగం మరియు రవాణాను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటోంది.కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి, కేంద్రాల నిర్వహణకు సుమారుగా రూ.6 కోట్లు ప్రతీ ఏటా విడుదల చేస్తోంది.
నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA):
గ్రామీణ, పట్టణ స్థాయిలలో అవగాహన ర్యాలీలు, పాఠశాల మరియు కళాశాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.యువ వాలంటీర్లు, ఎన్జీఓలు, విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో భాగమై, అవగాహనను విస్తరించడంలో ముందుండి పనిచేస్తున్నారు.ప్రతి జిల్లా స్థాయిలో డ్రగ్ అవగాహన క్లబ్బులు ఏర్పాటు చేసి, యువతలో మత్తు వ్యసన వ్యతిరేక సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

