10 సీట్లతో ప్రవేశాలకు అనుమతించిన ప్రభుత్వం
విశాఖపట్నంలోని ప్రఖ్యాత హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రంలో 3 ఎంసిహెచ్ కోర్సులను ప్రారంభించడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఎంసిహెచ్ సర్జికల్ ఆంకాలజిలో ప్రతి ఏడాది 2 సీట్లకు, ఎంసిహెచ్ గైనకలాజికల్ ఆంకాలజీ లో 4 సీట్లకు, డిఎమ్ మెడికల్ ఆంకాలజిలో 4 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. ఈ 3 విభాగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం 13 ఎంసిహెచ్ సీట్లు మాత్రమే ఉన్నాయి. 120 పడకల తో కూడిన హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రం భారత ప్రభుత్వం వారి పూర్తి గ్రాంటుతో అణుశక్తి విభాగం పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ. మొత్తం 10 సీట్ల తో 3 క్యాన్సర్ స్పెషాల్టీ కోర్సులను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు


