ఒంగోలులోని మన శ్రీరామ్ హాస్పిటల్ లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కొత్తగా అదనంగా మూడు అత్యాధునిక మెషీన్లు 1. 3D/4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్, 2. సీ ఆమ్ మెషీన్ మరియు 3. లేపరోస్కోపీ మెషీన్ లను సమకూర్చినట్టు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు.
3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ :
మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం హై రిజొల్యూషన్ 3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్ ను మేడాం గారి ఛాంబర్ లో అమర్చడం జరిగింది.
దీనివలన స్త్రీల సమస్యలు మరీ ముఖ్యంగా సంతాన సాఫల్యత సమస్యలతో బాధపడే మహిళలలో అండం అభివృద్ధి గురించి ( ఫాలిక్యులార్ స్టడీస్ ) మరింత ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో ….. కడుపులో బిడ్డ ఎదుగుదల మరియు బిడ్డ లోపల అవయవాల అభివృద్ధి మరింత స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది.

సీ ఆమ్ మెషీన్ ( C- Arm )
విరిగిన ఎముకలు , వెన్నెముక ఆపరేషన్లలో మరింత మెరుగైన ఫలితాలు, ఖచ్చితత్వం కోసం ఈ అధునాతన హై రిజొల్యూషన్ సీ ఆమ్ మెషీన్ ను మన అత్యాధునిక ల్యామినార్ ఆపరేషన్ థియేటర్ లో అమర్చడం జరిగింది. దీని వలన విరిగిన ఎముకలని మరింత స్పష్టంగా, మరింత సులభంగా సరి చెయ్యడం వీలవుతుంది.

కీ హోల్ సర్జరీ కోసం మరియు సర్జరీ తరువాత పేషంట్ లు త్వరగా కోలుకుని రెండు మూడు రోజులలోనే డిశ్చార్జ్ అయి తమ రోజు వారీ పనులను చేసుకోవడం కోసం అత్యాధునిక లేపరోస్కోపీ మెషిన్ ను ల్యామినార్ ఆపరేషన్ థియేటర్లో సమకూర్చడం జరిగింది. దీని వలన కుట్లు లేని ఆపరేషన్ చెయ్యడమే కాకుండా అతి తక్కువ కోత, బ్లీడింగ్ & వేగవంతమైన రికవరీ ఉండి పేషంట్ కి ఆపరేషన్ జరిగిందన్న భావన ఉండదు. అంతే కాకుండా దీని వలన సర్జరీ కాంప్లికేషన్స్ ను కూడా చాలా వరకు తగ్గించడం కుదురుతుంది.

డాక్టర్ చాపల వంశీకృష్ణ
MS ( Ortho ) Osmania, M.Ch ( Ortho ), UK Trained In Spine & Joint Replacement Surgery,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు రోడ్డు, ఒంగోలు.
24/7 హెల్ప్ లైన్ నంబర్: 8184 82 82 82