నెలలు నిండకుండా అయిదుగురు శిశువుల జననం

ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పటల్

నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలను విజయవాడలోని అంకురల హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం కాపాడింది. హాస్పిటల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు,ఇంటెన్సివ్ బృందం తో పాటుగా అతి క్లిష్టమైన సమస్యలతో కూడిన రోగులు, నవజాత శిశువుల
ప్రాణాలను రక్షించడానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉండటంలో ఇది సాధ్యమైంది. సంక్లిష్టమైన వైద్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.అంకుర హాస్పిటల్స్ గ్రీన్ ఓ టీ లెవెల్ 3 NICU, లెవెల్ 3 PICU ఉన్నాయి. ఇది స్థిరమైన ఆరోగ్య సంరక్షణ అందించటాన్ని ప్రోత్సహిస్తుంది. మద్దతు ఇస్తుంది. క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులతోనెలలు నిండకుండానే జన్మించిన శిశువులను చికిత్సను సులభతరం చేయడానికీ, నాణ్యమైనపీడియాట్రిక్ కేర్ అత్యధిక స్థాయిలో అందించడానికి ఇక్కడ తగిన సదుపాయాలు వున్నాయి. అత్యంతనైపుణ్యం, సమర్థవంతమైన క్రిటికల్ కేర్ బృందం ఉంది. అన్ని రకాల క్లిష్టమైన కేసులనునిర్వహించడంలో వైద్య నిపునణులు, నాణ్యమైన సంరక్షణ, ప్రత్యేకమైన రోగిఅనుభవాలకు భరోసా ఇస్తారు.

విజయవాడలోని అంకుర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి. విజయ్ కుమార్ ఈ విజయాన్ని గురించి మాట్లాడుతూ.. ‘ఎంతటి క్లిష్టమైన దశలోనయినా ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం..నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను నిర్వహించడానికి అత్యాధునికసౌకర్యాలను ఉపయోగించడంలో శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మా వద్ద ఉంది. నెలలు నిండకుండానే జన్మించిన నలుగురు శిశువులు , కవలల ప్రాణాలను కాపాడటం మా వైద్యులబృంద నైపుణ్యానికి, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతకు నిదర్శనం..ఈవిజయం తమ రోగుల శ్రేయస్సు పట్ల ఆసుపత్రి నిబద్ధతకు నిదర్శనం” అని అన్నారు.

అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ రావు వున్నం మాట్లాడుతూ “నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలనుకాపాడినందుకు సంతోషిస్తున్నాం.. ఈ శిశువులందరిలోనూ సంక్లిష్టతలు ఉన్నాయి .. మరి
కొంతమందికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.. అయితే ఈ క్లిష్టమైన కేసులను నిర్వహించే వైద్య బృందం అంకితభావం, నైపుణ్యానికి నిదర్శనం. అత్యంత నైపుణ్యం కలిగినిపుణుల బృందంతో అన్ని కేంద్రాలో్ల లెవెల్ 3 NICU, PICU వంటి అత్యాధునిక సదుపాయాలతో రోగులకు అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణ అందించాలని అంకుర హాస్పిటల్ విశ్వసిస్తుందని అన్నారు.

Share this News

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *