ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ ఆఫీసు వెనుక ఉన్న శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ రోజు గురువారం మల్టీ స్పెషాలిటీ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరఒలో సుమారు 150 మంది రోగులు ఉచితంగా వైద్యాన్ని పొందారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎముకలు, కీళ్లు, నరములు, స్త్రీల సమస్యలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ సమస్యలు, ఛాతి, ఊపిరితిత్తులు, దంత సమస్యలు, బిపి, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కొలెస్ట్రాల్, గుండె, కిడ్నీ, లివర్, నరాల సమస్యలు, మెదడు, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు, ఫిజియో థెరపి సమస్యలకు వైద్య సేవలు అందించారు.
ఉచిత ఓపి తో పాటు ఎముకల పటుత్వ పరీక్ష ( BMD ), గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్ష ఉచితంగా, రక్త పరీక్షలు, ఎక్స్ రేలు రాయితీపై చెయ్యడం జరిగింది.
ఈ మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరంలో – ఎముకలు, కీళ్లు, నరాల వైద్య నిపుణులు డా.ౘాపల వంశీ కృష్ణ, గర్భ కోశ, ప్రసూతి, సంతానలేమి, హైరిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ డాక్డర్ చాపల శాంతకుమారి, జనరల్ & ఫ్యామిలీ ఫిజీషియన్, షుగర్, బిపి, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వైద్య నిపుణులు డా.సానల ధీరజ్, జనరల్, లేపరోస్కోపిక్ సర్జన్ డా.సున్నపు విజయ్ కుమార్, ఊపిరితిత్తులు, ఛాతి, నెమ్ము, ఆయాసం వైద్య నిపుణులు డా.నాగిడి కుమార్ వర్మ డెంటల్ & కాస్మొటిక్ స్పెషలిస్ట్ డా.సున్నపు నవీన.ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ & రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ డా.పొక్కినగారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.