కీళ్ల వాతానికి స్టెమ్ సెల్ థెరపీ

విరించి హాస్పట్ లో చికిత్స

రీజనరేటివ్ మెడిసిన్ విభాగం ఏర్పాటు

తెలుగు రాష్ట్రాలలోనే మొట్ట మొదటి సారిగా కీళ్ల వాతంతో భాదపడుతున్న వారికి మణిపాల్ విశ్వవిద్యాలయంకు చెందిన స్టెమ్ ప్యూటిక్స్ రీసెర్చి ల్యాబ్ వారు రూపొందించిడ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వారు ఆమోదించినఅత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ చికిత్సను హైదరాబాద్ లోని విరించి హాస్పటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

స్టెమ్ సెల్ థెరపీ ద్వారా పలు రకములైన చికిత్స అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేసి అందుబాటులోనికి తెచ్చిన విరించి హాస్పిటల్

కార్టిలేజ్ లేదా కీళ్లకు సంబంధించిన అంతర్భాగాలు అరిగిపోయిన నేపధ్యంలో వైద్యులు ప్రధానంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స కు ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఎంతో నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా దీని యొక్క జీవనకాలం షుమారుగా పదేళ్లకు పరిమితమవుతుంది. దాంతో ఒక సారి కీళ్ల మార్పిడి చేసుకొన్న వారు దశాబ్దం తర్వాత మరో మారు దానిని చేయించుకొవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న వయస్సులోనే కీళ్ల మార్పిడి చేయించుకోవాల్సిన వ్యక్తులలో ఎంతో ఇబ్బంది కరమైన పరణామం గా మారుతోంది.

ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక వైద్యంలో అందుబాటులోనికి వచ్చిన స్టెమ్ సెల్ థెరపీ ద్వారా కీళ్ల మార్పిడికి ప్రధాన కారణంగా భావించే అరిగిపోయిన కార్టిలేజ్ ను పునః సృష్టించడం ద్వారా చికిత్స అందించడం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటి వరకూ రోగి నుండి సేకరించిన స్టెమ్ సెల్ ను వినియోగించి ల్యాబొరేటరీలలో కల్చర్ చేయడం ద్వారా Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను తయారు చేసి కీళ్ల వద్ద శరీరంలోనికి చొప్పించడం ద్వారా అరిగిపోయిన కార్టిలేజి పునరుజ్జీవింపచేయడం ద్వారా సమస్యను దూరం చేయడం జరుగుతోంది.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న విరించి హాస్పటల్ డాక్టర్లు

అయితే పలు సందర్భాలలో రోగి నుండి సేకరించిన స్టెమ్ సెల్ ద్వారా తయారు చేయబడిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells అంతగా ప్రభావం చూపకపోవడం అంటే కార్టిలేజ్ పునరుజ్జీవనం సరిగ్గా జరుగకపోవడం, ఒక వేళ జరిగినా ఇబ్బందులు రావడం జరుగుతోంది. అంతే గాకుండా ఈ ప్రక్రియలో రోగి నుండి మొదటి సారి శస్త్ర చికిత్స ద్వారా స్టెమ్ సెల్ ను సేకరించడం తదనంతరం రెండో శస్త్ర చికిత్స ద్వారా ల్యాబ్ లో తయారు చేయబడిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను శరీరంలోనికి చొప్పించడం చేస్తారు. అంటే రోగి రెండు సార్లు శస్త్ర చికిత్సకు సిద్దం కావల్సి ఉంటుంది.

దీనికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యవంతులైన యువకుల నుండి సేకరించిన బోన్ మారో నుండి తీసిన స్టెమ్ సెల్ ను వినియోగించి తయారు చేసిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను కీళ్ల మార్పిడిలో వినియోగించడం అనే ప్రక్రియకు వైద్య నిపుణులు స్వీకారం చుట్టారు. దీనిపై మంగళూరులోని మణిపాల్ యూనివర్శిటీకి చెందిన స్టెమ్ ప్యూటిక్స్ రీసెర్చి ల్యాబ్ వారు చేపట్టిన పరిశోధనల ద్వారా తయారైన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను వినియోగించే ప్రక్రియకు భారత దేశపు డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా దేశంలోనే మొట్ట మొదటి సారిగా అనుమతి లభించింది.

డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి అనుమతి పొందిన స్టెమ్ థెరిప్యూటిక్స్ ల్యాబ్ ద్వారా తయారు చేయబడిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను వినియోగించి అరిగిపోయిన కీళ్ల వద్ద కీలకంగా ఉండే కార్టిలేజ్ (Cartilage) ను పునః సృష్టించడమనే ప్రక్రియకు రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా హైదరాబాదులోని ప్రఖ్యాత వైద్య సేవల సంస్థ అయిన విరించి హాస్పిటల్ వేదికగా మారింది. ఇలా డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ద్వారా అనుమతించబడిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్ట మొదటి సారి విరించి హాస్పిటల్ లోని ఆర్థోపీడిక్ వైద్య విభాగంకు చెందిన వైద్యులు డా. నటేష్, కన్సల్టెంట్ ఆర్థోపీడియాక్ సర్జన్ వారు హైదరాబాదుకు చెందిన 65 సంవత్సరముల పైబడిన పురుషునికి చికిత్స అందించడం జరిగింది.

చికిత్సకు సంబంధించిన ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా నేడు విరించి హాస్పిటల్స్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ నూతన వైద్య ప్రక్రియకు సంబంధించిన వివరాలను వైద్య బృందం వెల్లడించింది.

ముందుగా డా. నటేష్, కన్సల్టెంట్ ఆర్థోపీడిక్ సర్జన్, విరించి హాస్పిటల్స్, హైదరాబాదు వారు ఈ సరికొత్త వైద్య ప్రక్రియను వీడియా ద్వారా వివరించారు. సాధారణంగా చిన్న వయస్సులోనే కీళ్ల మార్పిడి చేయించుకోవాల్సిన రోగులలో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను మరళా మరళా చేయడం అనే సమస్య పలు మార్లు ఇబ్బందిగా మారుతుందని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells ను వినియోగించడమే ఆధునిక విధానం అందుబాటులోనికి వచ్చినా దానికి చికిత్స అందించడంలో పలు కారణాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ ఇబ్బందులను దూరం చేయడంలో ఇపుడు అందుబాటులోనికి వచ్చిన ఆధునిక ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. కేవలం ముప్పై నిమిషములలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా రోగికి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా సాయంత్రానికి డిశ్చార్జ్ చేయడం జరిగిందని డా. నటేష్ తెలిపారు. ఇలా శరీరంలోనికి ప్రవేశ పెట్టిన Mesenchymal stem cells (MSCs) లేదా mesenchymal stromal cells యొక్క ప్రభావంతో రోగి కీళ్ల వద్ద నుండే కార్టిలేజ్ మూడు నెలలో తిరిగి పునరుజ్జీవనం చేయబడి ఆరోగ్యకరమైన కీళ్లుగా పరిణామం చెందుతాయన్నారు. ఈ సమయంలో రోగికి ప్రత్యేకంగా మందులు కూడా ఏమీ అవసరం ఉండదని చెప్పారు.

అనంతరం డా. శ్యామ్ సుందర్, అత్యవసర వైద్య నిపుణులు మరియు డైరెక్టర్, విరించి హాస్పిటల్ వారు మాట్లాడుతూ ఈ ప్రత్యేక థెరపీని కేవలం కీళ్ల మార్పిడి కి సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడంలోనే కాకుండా వెన్నుముకకు గాయం ఏర్పడిన సందర్భంలోనూ, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ (ARDS) ను తగ్గించడానికి, హార్ట్ ఫెయిల్యూర్, పాడై పోయిన కంటి రెటినా ను తిరిగి పునరుజ్జీవనం చేయించడం లాంటి ఎన్నో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా వినియోగించబడుతుందని చెప్పారు. విరించి హాస్పిటల్స్ వారు ఈ వైద్య విధానాన్ని విస్తృతంగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తోందని వివరించారు.

తర్వాత శ్రీ వి సత్యన్నారాయణ, డైరెక్టర్, విరంచి గ్రూపు వారు మాట్లాడుతూ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా ఎన్నో రకములైన ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారం అందించవచ్చని అందుకే ఈ చికిత్సను అందరికీ అందుబాటులోనికి తీసుకొని రావడానికి ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసన్ విభాగాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంతే గాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించి సేవలను అందించనున్నామని చెప్పారు.

అంతకు ముందుగా కార్యక్రమంలో డా. శ్రీనివాస్ సామవేధం, మెడికల్ డైరెక్టర్, విరంచి హాస్పిటల్ వారు సంస్థ అందిస్తున్న పలు వైద్య సేవలను వివరించారు. 500 పడకలు అందులోనూ 110 ఐ సీ యూ పడకలు కలిగి 11 ఆపరేషన్ ధియేటర్లు మరియు ఇతర అత్యాధునికి డయాగ్నస్టిక్ సేవలను విరించి హాస్పిటల్ అందుబాటులోనికి తీసుకొని వచ్చిందని తెలిపారు. తమ రోగులకు అత్యాధునిక సేవలు అందించడంలో నిరంతరం ముందంలో ఉండే విరించి హాస్పిటల్ కృషి లో భాగంగానే ఈ సరికొత్త స్టెమ్ సెల్ చికిత్స ను కూడా ప్రవేశ పెట్టడం జరుగుతోందని ఇదే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఆధిక చికిత్సను అందుబాటులో తీసుకొని వస్తామని చెప్పారు.

ఈ విలేకరుల సమావేశంలో డా. శ్యామ్ సుందర్, డైరెక్టర్, విరించి హాస్పిటల్ – శ్రీ వి సత్యన్నారాయణ, డైరెక్టర్, విరంచి గ్రూపు – డా. శ్రీనివాస్ సామవేదం, మెడికల్ డైరెక్టర్, విరించి హాస్పిటల్ మరియు డా. నటేష్, కన్సల్టెంట్ ఆర్థోపీడిక్ సర్జన్, విరించి హాస్పిటల్స్ హైదరాబాదు వారు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *