కామినేనిలో ఆఫర్డ్ ప్లాన్

ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా
ఆరోగ్య సంరక్షణ సంస్థతో భాగస్వామ్యం
ఓపీడీ, ల్యాబ్ టెస్టులు, మందుల కొనుగోలు..
ఇన్ పేషెంట్ ట్రీట్ మెంట్స్ తదితర సేవలకు వర్తింపు

ప్రపంచ మధుమేహ దినం (14 నవంబర్ 2022) సందర్భంగా కామినేని హాస్పిటల్స్ (పోరంకి, విజయవాడ), గురుగ్రామ్ కు చెందిన ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అయిన ఆఫర్డ్ ప్లాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కామినేని ఆసుపత్రి రోగులకు వినూత్న, కస్టమర్ స్నేహపూర్వక ఉత్పాదనలను అందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆఫర్డ్ ప్లాన్ ఉనికిని పటిష్ఠం చేయడంలో ఇది తోడ్పడనుంది. ఆఫర్డబుల్ ప్లాన్ స్వాస్థ్ అనేది ప్రీ పెయిడ్ డిజిటల్ వాలెట్. అవుట్ పేషెంట్ డిపార్ట్ మెంట్ (ఓపీడీ) సేవలు, ల్యాబ్ పరీక్షలు, మందుల కొనుగోలు, అన్ని ఇన్ పేషెంట్ డిపార్ట్ మెంట్ (ఐపీడీ) చికిత్సలకు వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్ (విజయవాడ) సీఓఓ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ మధుమేహం అనేది ఒక తీవ్రమైన అనారోగ్యం లాంటిది. ఇతర తీవ్ర సమస్యలతో పాటుగా అంధత్వం, గుండె వ్యాధులు, కిడ్నీవ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉంది. మధుమేహ నిర్వహణను మెరుగుపరిచేందుకు, సమస్యలను నివారించేందుకు, జీవన నాణ్యతను అధికం చేసేందుకు గాను మధుమేహ వ్యాధి సంరక్షణ అవసరమైన యాక్సెస్ స్థాయిలపై అవగాహన పెంచడం ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ఆఫర్డ్ ప్లాన్ బిజినెస్ హెడ్ (సౌత్) పీఆర్ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. ఆరోగ్యదాయక డైట్ లేకపోవడం, కెలోరీస్, షుగర్స్, ఫ్యాట్స్, ఫైబర్ పరిమితికి మించి తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి మధుమేహానికి ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. సరైన ప్రయత్నాలతో మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. ఆహార, జీవనశైలి మార్పులు కోరుకున్న ఫలితాలు అందించడంలో విఫలమైన చోట, చికిత్స తప్పదు. ప్రజలపై భారం తగ్గించేందుకు, అందుబాటు ధరల్లో రెగ్యులర్ చెకప్స్, మందులకు వీలుగా స్వాస్థ్ కార్డును ఆఫర్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది అని అన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *