డిసెంబర్ కల్లా ‘అభా’ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.
సిహెచ్ ఓలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు ఆదేశం.
‘భవిష్యత్లో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల లోనే
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఎబిహెచ్ఎ-అభా) నమోదు ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సిహెచ్ ఓలు) స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి సిహెచ్ ఓల శిక్షణా కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభా నమోదు ప్రక్రియ ఇప్పటి వరకూ 70 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికల్లా మిగిలిన 30 శాతం పూర్తయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియ విషయంలో అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రతి వ్యక్తియొక్క ఆరోగ్య సమాచారానికి సంబంధించిన రికార్డు మన వద్ద వుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య బృందానికి సిహెచ్ ఓలే టీం లీడర్ గా వ్యవహరిస్తారన్నారు. ప్రజలు తమకు గతంలో అందిన , ఇప్పుడు అందుతున్న వైద్య సేవలను బేరీజు వేసుకుని ప్రస్తుత సేవలపై సంతృప్తి వ్యక్తం చేసే విధంగా సిహెచ్ ఓలు అంకిత భావంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానం ద్వారా గ్రామీణులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలందించే విధంగా సిహెచ్ ఓలు వ్యవహరించాలన్నారు. గ్రామస్తాయిలోనే తమకు అవసరమైన వైద్య సేవలందుతాయన్న విశ్వాసాన్ని గ్రామీణులకు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపవద్దని, ప్రజలకు వైద్య సేవలందించటంలో చురుగ్గా వ్యవహరించి వారిలో విశ్వాసం కల్పించాలని ఆయన సూచించారు. సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా
గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
గర్భిణుల విషయంలో సిహెచ్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కృష్ణ బాబు సూచించారు. ప్రసవానికి ముందు, తర్వాత వారికి తగిన సలహాలివ్వాలన్నారు.బిపి , షుగర్ సమస్యల పట్ల వారికి సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తు లో ఎదురయ్యే పరిణామాల గురించి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా వెళ్లి వారిలో ఆత్మ విశ్వాసం కలిగించాలన్నారు. వారిలో ని అపోహలు తొలగించాలన్నారు. 67 రకాల మందులు , 14 రకాల టెస్టుల్ని కింది స్థాయిలో అందుబాటులో వుంచామనీ ఏదైనా మందు దొరక్కపోతే సమీప పీహెచ్సీ నుండి తెప్పించుకోవాలన్నారు. మానసిక సమస్యల పరిష్కారం కోసం 14410 టెలీమానస్ నంబరును సంప్రదించాలన్నారు. శానిటేషన్, హైజిన్ లకు సిఎం గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మనపైన సిఎం గారు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.