ఫెర్టీ 9లో సంతానలేమికి అత్యాధునిక చికిత్స

  • వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స
  • ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ 
  • అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్  ట్రీట్ మెంట్  పై 50 శాతం రాయితీ 
  • నవంబర్ 11న ప్రారంభించనున్న సినీ నటి ఆమని
  • ఫర్టీ 9 సెంటర్  డాక్టర్ సి జ్యోతి వెల్లడి

సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని,  వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు  డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని, సంతాన  లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.  సికింద్రాబాద్ లోని ఎన్  సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9  సెంటర్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా  ప్రముఖ సినీ నటి ఆమని  లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను ఈ నెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్  లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృత్వం మహిళలకు ఒక వరం లాంటిదని,  ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం అని అన్నారు.  ఫర్టీ 9 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అధునాతనమైన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ చికిత్సా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది నిస్సందేహంగా ఉన్నతమైన సక్సెస్ రేట్ ని సాధించగల ఓ అత్యుత్తమ సంతాన సాఫల్యత చికిత్సా విధానం అని చెప్పవచ్చు

50 శాతం డిస్కౌంట్ 

సంతాన సాఫల్యత రంగంలోనే వినూత్నమైన ఈ ఐ వీ ఎఫ్ పై 50%  డిస్కౌంట్ విధానాన్ని ని సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 క్లినిక్ లో ప్రముఖ సినీ తార ఆమని చే మార్చి నవంబర్ 11 నఉదయం 11 గంటలకు  ప్రారంభిస్తారు. సంతానలేమి సమస్యతో బాధపడుతూ తమ కలల పంటలైన పిల్లల కోసం పరితపిస్తున్న ఎంతోమంది దంపతులకు దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి అందుబాటు ధరల్లోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన చికిత్సనందిస్తూ  వారి కలల సాకారంలో కీలక పాత్ర వహిస్తూ సంతాన సాఫల్యత చికిత్స రంగంలోనే తనదైన ఒరవడిని సృష్టించి విలక్షణ ముద్ర వేసిన ‘ ఫర్టీ 9 ‘ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంటూ ఈ రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. తన క్లినిక్ లలో ప్రపంచస్థాయి ఐ వీ ఎఫ్ చికిత్స చేయించుకునే దంపతులకు చికిత్స వ్యయం లో 50 % డిస్కౌంట్ ని ఫర్టీ 9 అందిస్తోంది .

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *