అందుబాటులోకి ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం
పిడుగురాళ్ళలోని డాక్టర్ అంజిరెడ్డి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఉచిత న్యూరో సర్జరీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు డాక్టర్ గుమ్మడి విద్యాసాగర్ తెలిపారు. పిడుగురాళ్లలో తొలిసారిగా అంజిరెడ్డి ఆసుపత్రిలో ఫుల్ టైం న్యూరో సర్జరీ విభాగం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. మెదడు-వెన్నుముక సర్జరీలు, ఫిట్స్, పక్షవాతం, నరాల బలహీనత, న్యూరో ఎండోస్కోపీ, మెడనొప్పి, తిమ్మిర్లు ఎక్కువగా రావటం, నరాల నొప్పులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.. ఎంఆర్ ఐ స్కాన్ కేవలం రూ 2 వేలు, సిటీ స్కాన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే.. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచితంగా సర్జరీలు చేయనున్నట్టు తెలిపారు.