బహుదూర్ పల్లిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో ఆస్టర్ ప్రైమ్ హాస్పటల్ బృందం శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు 140 మందికి పైగా విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ వైద్యులు డాక్టర్ మౌలిక డాక్టర్ అర్చనతో పాటు నర్సింగ్ సిబ్బంది, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ క్యాంప్ కో ఆర్డినేటర్ విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. రెండు రోజుల పాటూ నిర్వహించనున్న ఈ ఆరోగ్య శిబిరాన్ని ఈనెల 19 శనివారం కూడా నిర్వహించనున్నారు.