- మత్తు మందు రోగుల..
- శ్వాసనాళాల నియంత్రణపై ప్రదర్శనలు
మత్తు మందుకు బానిసైన రోగి శ్వాస నాళాన్ని నియంత్రించే విషయమై హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు ఆదివారం వర్క్ షాప్ నిర్వహించారు. హాస్పటల్ అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాపులో మత్తు మందు ప్రభావంలో ఉన్న రోగుల శ్వాస నాళంలో తలెత్తే ఇబ్బందులు-రోగులకు ఎలాంటి శ్వాస పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అందుబాటులో ఉన్న వివిధ పద్దతులను వైద్య నిపుణులు వివరించారు. ఒక రోజు పాటు నిర్వహించిన ఈ వర్క్ షాపులో మత్తు మందు అందించే క్రమంలో రోగులలో ఏర్పడే వివిధ సంక్లిష్టమైన పరిస్థితులు..తద్వారా తలెత్తే శ్వాస పరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వైద్యులు ప్రత్యేకమైన ప్రదర్శనలు కూడా నిర్వహించారు.ఈ ప్రత్యేకమైన వర్క్ షాపును అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ విభాగం వైద్యులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ సి.యన్ చంద్ర శేఖర్, డాక్టర్ సి ఉమా శ్రీదేవి నిర్వహించారు. వీరితో పాటూ ప్రొఫెసర్ సురేందర్, ప్రొఫెసర్, యన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ పద్మజ లు సంబంధిత అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చారు. వీరితో పాటు డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ఇందిర, డాక్టర్ విభావరి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బసంత్ తదతరులు వర్క్ షాపు లో పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు.
