- అప్రమత్తంగా ఉండండి..
- రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఒమిక్రాన్ (omicron).. ప్రపంచ దేశాలను గడ తడ లాడిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్ ఇదే. అత్యంత వేగంగా వ్యాపిచెందే ప్రమాదకర ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే వ్యాప్తి చెందిన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంగ్కాంగ్ (చైనా) దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కఠినమైన స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు.ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలి..కోవిడ్ హాట్స్పాట్లను గుర్తించాలి.. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచండి.. దీని కోసం ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబ్లను వినియోగించుకోవాలని సూచించారు.తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా చూడాలి.. ప్రజలకు సరైన, వాస్తవాలతో కూడిన సమాచారం అందేలా ఎప్పటికపుడు అధికారికంగా బులిటెన్లు విడుదల చేయటంతో పాటు మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వాలని కోరారు.