నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యునకబుల్ డిసీజెస్ (NP-NCD)పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ . రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పాల్గొన్న ఎన్సీడీ జిల్లా పీఓలు, ఎపిడమాలజిస్టులు, ప్రివెంటివ్ అంకాలజీ నోడలాఫీసర్లు, సిహెచ్ ఓలు, ఎఎన్ ఎంలు, మెడికల్ ఆఫీసర్లు
మూడు విడతలుగా చేసిన ఎన్సీడీ స్క్రీనింగ్ లో నాణ్యత లోపించిది
మరింత అవగాహన కల్పించేందుకే మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించారు
ఎన్సీడీపై చేసే యుద్ధంలో ఎఎన్ఎంలు, సిహెచ్వోలు, మెడికల్ ఆఫీసర్లు, అంకాలజిస్టులే సైనికులు
8 నెలల్లో 70 శాతం మేర ఎన్సీడీ స్క్రీనింగ్ చేయడం అభినందనీయం
3.0 ఎన్సీడీ స్క్రీనింగ్ లో మధుమేహం, బీపీతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్యాన్సర్ పై కుడా స్క్రీనింగ్ చేశారు
4.1కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేశారు