- రమేష్ హాస్పటల్స్ పిలుపు
- పక్షవాతంపై వాకింగ్ తో అవేర్ నెస్
వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు పక్షవాతం పై అవగాహన కలిగించేందుకు ఈనెల 29న శనివారం ఉదయం 7 గంటలకు విజయవాడ నడక(వాకింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రమేష్ హాస్పటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నడక రమేష్ హాస్పిటల్స్, ఎం.జి. రోడ్ బ్రాంచ్ నుంచి ప్రారంభమై రమేష్ హాస్పిటల్స్, మెయిన్ యూనిట్ వద్ద ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మునిసిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరుకానున్నారు.