ఇక అంతా ఒమిక్రానే

కొవిడ్ పీడ తొలగినట్టేనా..! కొరోనావైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం కొరోనావైరస్ తరహాలో ఇది ఊపిరితిత్తుల కణజాలానికి వ్యాపించడం, అక్కడ పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన ఒమిక్రాన్ రకం తేలికపాటి జలుబుని మాత్రమే కలుగజేస్తుంది. […]

ఆస్టర్ ప్రైమ్ లో వర్క్ షాపు

మత్తు మందు రోగుల.. శ్వాసనాళాల నియంత్రణపై ప్రదర్శనలు మత్తు మందుకు బానిసైన రోగి శ్వాస నాళాన్ని నియంత్రించే విషయమై హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు ఆదివారం వర్క్ షాప్ నిర్వహించారు. హాస్పటల్ అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాపులో మత్తు మందు ప్రభావంలో ఉన్న రోగుల శ్వాస నాళంలో తలెత్తే ఇబ్బందులు-రోగులకు ఎలాంటి శ్వాస పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అందుబాటులో ఉన్న వివిధ […]

రెనోవాలో అరుదైన శస్త్రచికిత్స

తక్కువ ఖర్చుతో దిగ్విజయంగా ఆపరేషన్  విద్యార్ధిని ఆశలను బతికించిన డాక్టర్లు   అత్యంత తక్కువ ఖర్చుతో ఎంతో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసి సాధారణ జీవనాన్ని ప్రసాదించిన రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ వైద్యులు ఆమె ఒక డిగ్రీ పట్టా పుచ్చుకొన్న 21 సంవత్సరముల వయస్సు కలిగిన పేద విద్యార్థిణి. సంగారెడ్డి జిల్లా యేగోల్ గ్రామానికి చెందిన ఈ యువతి మూడువ తరగతి చదువుతున్న సమయంలో ఆటలాడుతూ చెట్టుపై ఎక్కి ప్రమాదవశాత్తు క్రింద పడి నడుం […]

ఒమిక్రాన్…జర జాగ్రత్త..!

అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ  ఒమిక్రాన్ (omicron).. ప్రపంచ దేశాలను గడ తడ లాడిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్‌ ఇదే. అత్యంత వేగంగా వ్యాపిచెందే ప్రమాదకర ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే వ్యాప్తి చెందిన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ (చైనా) దేశాల నుంచి […]

వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి నివారణ

వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. కుక్క కాటుకు గురై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం రేబిస్ అనేది రేబిస్ అనే వైరస్ కారణంగా వస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు మరియు గబ్బిలాల నుండి మానవునికి సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా జంతువుల నుండి మనుష్యులకు వ్యాపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రేబీస్ కారణంగా 56 వేల మంది ఏటా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 40 శాతం మందికి […]