ఏపీలో 39 లక్షల మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు

మిగిలిన వారికి 6 నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళిక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి క్యాన్సర్ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన అసంక్రమిత వ్యాధుల(NCD) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0 (ఎన్సీడీ) ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల మందికి స్కీనింగ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీచేశారు. ‘మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ […]

మధుమేహం నిరోధం ప్రతిఒక్కరి బాధ్యత

మధుమేహంపై కర పత్రం ఆవిష్కరణ సభలో డాక్టర్ ఎస్. ఎస్ .వి .రమణ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మధుమేహం నిరోధంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎస్. ఎస్. వి .రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక 2/1 బ్రాడీపేట లోని ఎస్ .హెచ్ .ఓ .సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నవంబర్ నెల-“మధుమేహం […]

వ్యసన విమోచన కేంద్రాలకు రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు

వైద్య పరికరాలు, మందులు, ఇతర అవసరాల కోసం  2023-24 కంటే 2024-25 సెప్టెంబరు నాటికి పెరిగిన ఓ.పి, ఐ.పి సేవలు మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి పిలుపు  రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాలు (డీ-ఆడిక్షన్ సెంటర్స్) బలోపేతానికి రూ.33.80 కోట్లు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.రాష్ట్రంలో జిల్లా, బోధనాసుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్య పరికరాలు, మందులు,మౌళిక సదుపాయాల కల్పన, సాంకేతిక  వ్యవస్థ మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు ,అవగాహన కార్యక్రమాలు అభివృద్ధి చేయనున్నారు. […]

అన్ని స్పెషాల్టీల్లో కలిపి 15 శాతం సీట్ల కేటాయింపు

విధులకు హాజరుకావాలని పీహెచ్సీ వైద్యులను కోరిన వైద్య ఆరోగ్య శాఖ పీహెచ్సీ వైద్యుల సంఘం కోరిక మేరకు పీజీ ఇన్-సర్వీస్ కోటాలో 15% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం అంగీకరించింది. అమరావతిలోని సచివాలయంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు ఇన్-సర్వీస్ పీజీలో 15% కోటా […]

హోమి భాభా క్యాన్సర్ సెంటర్ లో 3 సూపర్ స్పెషాల్టీ కోర్సులు

10 సీట్లతో ప్రవేశాలకు అనుమతించిన ప్రభుత్వం విశాఖపట్నంలోని ప్రఖ్యాత హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రంలో 3 ఎంసిహెచ్ కోర్సులను ప్రారంభించడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఎంసిహెచ్ సర్జికల్ ఆంకాలజిలో ప్రతి ఏడాది 2 సీట్లకు, ఎంసిహెచ్ గైనకలాజికల్ ఆంకాలజీ లో 4 సీట్లకు, డిఎమ్ మెడికల్ ఆంకాలజిలో 4 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. ఈ 3 విభాగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం 13 ఎంసిహెచ్ సీట్లు […]

పురుషుల్లోనూ వంధ్యత్వం..ఫెర్జీ 9 హాస్పటల్ అవగాహన

అందుబాటులోకి ఫెర్టీ 9 ఏ ఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్ష ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి ఏ ఐ వీర్యఅనలైజర్ ను ప్రవేశపెట్టిన సంస్థగా గుర్తింపు వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం కీలక ముందడుగు ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి హైదరాబాద్ : పురుషుల్లోనూ వంధ్యత్వం పై అవగాహన పెరగాలని, ఫెర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు. ప్రస్తుత రోజుల్లో పురుష వంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ, […]

క్యాన్సర్ పై ప్రచార భేరి .. ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్

ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు దాదాపు 50 వేల మందికిపైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు క్యాన్సర్ నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు అమరావతి: రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ […]

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కూరపాటి కృష్ణయ్య

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) గా భాద్యతలు స్వీకరించిన డా. కూరపాటి కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) గా డా. కూరపాటి కృష్ణయ్యను నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. 40 సంవత్సరముల పాటు వైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞడుగా పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా. కె కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ CEOగా పని […]

ఒంగోలు శ్రీరామ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు

ఒంగోలులోని మన శ్రీరామ్ హాస్పిటల్ లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కొత్తగా అదనంగా మూడు అత్యాధునిక మెషీన్లు 1. 3D/4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్, 2. సీ ఆమ్ మెషీన్ మరియు 3. లేపరోస్కోపీ మెషీన్ లను సమకూర్చినట్టు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు.  3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ : మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం హై రిజొల్యూషన్ 3D, 4D అల్ట్రా సౌండ్ స్కాన్ మెషీన్ […]

నెలలు నిండకుండా అయిదుగురు శిశువుల జననం

ప్రాణాలు కాపాడిన అంకుర హాస్పటల్ నెలలు నిండకుండానే పుట్టిన ఐదుగురు శిశువుల ప్రాణాలను విజయవాడలోని అంకురల హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం కాపాడింది. హాస్పిటల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు,ఇంటెన్సివ్ బృందం తో పాటుగా అతి క్లిష్టమైన సమస్యలతో కూడిన రోగులు, నవజాత శిశువుల ప్రాణాలను రక్షించడానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఉండటంలో ఇది సాధ్యమైంది. సంక్లిష్టమైన వైద్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు వారు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.అంకుర హాస్పిటల్స్ గ్రీన్ ఓ టీ […]