author

క్యాన్సర్.. ఉచిత కన్సల్టేషన్

ఏటా ఫిబ్రవరి 4 వ తేది న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై విస్తృత అవగాహన కలిపించడంతో పాటూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

ఎయిమ్స్ లో టెలీమెడిసిన్ సేవలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అంటే ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌-AIIMS) లో ఈనెల 5  శనివారం నుంచి ఈ-పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్‌) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముఖేష్‌ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు. సామాజిక […]

ఇక అంతా ఒమిక్రానే

కొవిడ్ పీడ తొలగినట్టేనా..! కొరోనావైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం కొరోనావైరస్ తరహాలో ఇది ఊపిరితిత్తుల కణజాలానికి వ్యాపించడం, అక్కడ పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన ఒమిక్రాన్ రకం తేలికపాటి జలుబుని మాత్రమే కలుగజేస్తుంది. […]

ఆస్టర్ ప్రైమ్ లో వర్క్ షాపు

మత్తు మందు రోగుల.. శ్వాసనాళాల నియంత్రణపై ప్రదర్శనలు మత్తు మందుకు బానిసైన రోగి శ్వాస నాళాన్ని నియంత్రించే విషయమై హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు ఆదివారం వర్క్ షాప్ నిర్వహించారు. హాస్పటల్ అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాపులో మత్తు మందు ప్రభావంలో ఉన్న రోగుల శ్వాస నాళంలో తలెత్తే ఇబ్బందులు-రోగులకు ఎలాంటి శ్వాస పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అందుబాటులో ఉన్న వివిధ […]

తేయాకు..లాభ నష్టాలు

తేయాకు గురించి సంపూర్ణ వివరణ – లాభనష్టాలు . తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు. 200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు […]

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను అమలు చేయటంలో ఏ మాత్రం  నిర్లక్ష్యంగా చేయద్దనీ, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై […]

రెనోవాలో అరుదైన శస్త్రచికిత్స

తక్కువ ఖర్చుతో దిగ్విజయంగా ఆపరేషన్  విద్యార్ధిని ఆశలను బతికించిన డాక్టర్లు   అత్యంత తక్కువ ఖర్చుతో ఎంతో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసి సాధారణ జీవనాన్ని ప్రసాదించిన రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ వైద్యులు ఆమె ఒక డిగ్రీ పట్టా పుచ్చుకొన్న 21 సంవత్సరముల వయస్సు కలిగిన పేద విద్యార్థిణి. సంగారెడ్డి జిల్లా యేగోల్ గ్రామానికి చెందిన ఈ యువతి మూడువ తరగతి చదువుతున్న సమయంలో ఆటలాడుతూ చెట్టుపై ఎక్కి ప్రమాదవశాత్తు క్రింద పడి నడుం […]

ఆస్టర్ ప్రైమ్ లో ప్రెగ్నెన్సీ ప్యాకేజీలు

ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం.. తక్కువ ధరలతో 9 మాసాల ప్యాకేజీలు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట, హైదరాబాదు వారు ఆస్టర్ నర్చర్ పేరుతో గర్భిణుల కోసం అత్యంత తక్కువ ధరలతో ప్రత్యేకంగా రూపొందిచబడిన 9 మాసాల గర్భదారణ ప్యాకేజీలను మంగళవారం (30.11.21) ప్రవేశ పెట్టారు.  ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ప్యాకేజీలు మహిళలలో అమ్మతనం తీసుకొని వచ్చే పూర్తి ప్రయాణకాలం .. అంటే గర్భదారణ సమయం నుండి ప్రసవం వరకూ జరిగే […]

ఒమిక్రాన్…జర జాగ్రత్త..!

అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ  ఒమిక్రాన్ (omicron).. ప్రపంచ దేశాలను గడ తడ లాడిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్‌ ఇదే. అత్యంత వేగంగా వ్యాపిచెందే ప్రమాదకర ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే వ్యాప్తి చెందిన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ (చైనా) దేశాల నుంచి […]

వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి నివారణ

వ్యాక్సిన్ తోనే రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. కుక్క కాటుకు గురై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం రేబిస్ అనేది రేబిస్ అనే వైరస్ కారణంగా వస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు మరియు గబ్బిలాల నుండి మానవునికి సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా జంతువుల నుండి మనుష్యులకు వ్యాపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రేబీస్ కారణంగా 56 వేల మంది ఏటా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 40 శాతం మందికి […]