ఈ ఏడాది చివరి నాటికి ఆసుపత్రులు సిద్ధం!
-2028 నాటికి సెకండరీ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీరుస్తాం!
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను దశల వారీగా ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోనికి తెస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సభ్యులు నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామిస్తూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటుకు గత ప్రభుత్వం నిధుల వ్య య్యంపై పరిపాలనాపరమైన ఆమోద ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నిర్మాణాలు వేగంగా జరగలేదన్నారు. గత ప్రభుత్వం సీతంపేట మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి భవన నిర్మాణాలకు రూ.12 కోట్లు ఖర్చుపెట్టగా కూటమి ప్రభుత్వం ఆదనంగా రూ. 15 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. మిగిలిన రూ.11 కోట్లతో నిర్మాణాలను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు దోర్నాల మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి భవనాన్ని జులై, మిగిలిన ఆసుపత్రుల నిర్మాణాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని తెలిపారు.
ఓపీ/ఐపీ సేవలు పెరుగుతున్నాయ్!
సెకండరీ ఆసుపత్రు (ఏరియా, సీహెచ్సీ, జిల్లా)ల్లో డాక్టర్ల కొరత 2028 నాటికి తీరుతుందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వం జీరో వెకెన్సీ ప్రకారం వైద్యుల పోస్టులు భర్తీ చేయడంలో విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సెకండరీ ఆసుపతుల్లో 300 వైద్యుల పోస్టులను నేరుగా భర్తీ చేసిందని, ఇన్సర్వీస్, సీనియర్ రెసిడెంటు కేటగిరీల్లో అదనంగా 600 మంది వైద్యులు వచ్చారన్నారు. 2028 నాటికి సెకండరీ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు చేబడుతున్నామని తెలిపారు. సీతంపేట ఆసుపత్రిలో 24కుగాను 21 మంది వైద్యులు ఉన్నారని తెలిపారు. వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు. తీసుకుంటూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పరికరాలు/ యంత్రాలను అందుబాటులోనికి తీసుకువస్తున్నందువల్ల ఓపీ/ ఐపీ సేవలు పెరుగుతున్నాయన్నారు. సీతంపేట ఆసుపత్రిలో 2023-24లో కంటే 2024-25లో ఓపీ సేవలు ఆరువేల వరకు పెరిగాయని తెలిపారు. సీతంపేటలో డయాలసిస్ అవసరాల కోసం ఇటీవల అదనంగా ఐదు పడకలు పెంచామని పేర్కొన్నారు.

