విజయవాడ శివారులోని గొల్లపూడిలో ఉన్న ఆయుష్ ప్రధాన కార్యాలయం ఆటోనగర్లోనికి మారబోతుంది. ఈ కార్యాలయం గురువారం నుంచి పనిచేస్తుందని ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త కార్యాలయ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారని కమిషనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
కార్యాలయ అడ్రస్ కోనేరు రమాదేవి భవనం (మూడో అంతస్తు, బ్లాక్-4 ప్లాటు నెంబరు-17) హౌస్ నెంబరు 54-4/1-102, నియర్ బీఎంపీఎస్ ట్రాన్స్ పోర్ట్ హెడ్ ఆఫీస్, ఆటోనగర్, విజయవాడ.

