- తక్కువ ఖర్చుతో దిగ్విజయంగా ఆపరేషన్
- విద్యార్ధిని ఆశలను బతికించిన డాక్టర్లు
అత్యంత తక్కువ ఖర్చుతో ఎంతో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసి
సాధారణ జీవనాన్ని ప్రసాదించిన రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ వైద్యులు
ఆమె ఒక డిగ్రీ పట్టా పుచ్చుకొన్న 21 సంవత్సరముల వయస్సు కలిగిన పేద విద్యార్థిణి. సంగారెడ్డి జిల్లా యేగోల్ గ్రామానికి చెందిన ఈ యువతి మూడువ తరగతి చదువుతున్న సమయంలో ఆటలాడుతూ చెట్టుపై ఎక్కి ప్రమాదవశాత్తు క్రింద పడి నడుం వద్ద ఉండే ఎముకలకు దెబ్బ తగలడం వలన హిప్ జాయింట్ దెబ్బ తిని తను సరిగ్గా నడువ లేని స్థితికి చేరుకొంది. తన కాలు పూర్తి స్థాయిలో విచ్చుకోలేని పరిస్థితులలో నడవడం అటుంచి సాధారణ పనులను చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడే నిస్సహాయ స్థితి. అలాంటి పరిస్థితులలో ఒక వైపు ప్రమాదవశాత్తు సంభవించిన అంగవైకల్యం మరో వైపు పేదరికం ఎదుర్కొంటూ తను డిగ్రీ పూర్తి చేయడం విశేషం.
అలాంటి అమ్మాయి అంగవైకల్యం నయం చేయాలని తల్లితండ్రులు గత దశాబ్ద కాలంగా చేయని ప్రయత్నం లేదు. ఎందరో వైద్యులను సంప్రదించారు కానీ ఫలితం దక్కలేదు. అయితే పట్టు విడువని అమ్మాయి తల్లితండ్రులు రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ కు చెందిన ప్రముఖ ఎముకల వ్యాధి శస్త్ర చికిత్స నిపుణులు అయిన డా. వి కోటేశ్వర ప్రసాద్ గారిని సంప్రదించారు. ఈ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకొన్న డా. వి కోటేశ్వర ప్రసాద్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని ఇతర వైద్య నిపుణులతో కలసి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని హిప్ రీప్లేస్మెంట్ (నడుము జాయింట్ మార్పిడి) శస్త్ర చికిత్స చేయడం జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిన మూడువ రోజు నుండి ఆ యువతి తనకు తానుగా కాళ్ల మీద నిలబడి స్వంతంగా నడువగలుగడం విశేషం. తద్వారా ఆ యువతి భవిష్యత్తులో ఇతర యువతుల వలే సాధారణ జీవనాన్ని గడువడానికి వీలవుతుంది.
ఈ యువతి కథ ఇలా ఉంటే మరో వైపు 84 సంవత్సరముల వృద్దుడు తీవ్రమైన మోకాళ్ల నొప్పితో భాదపడుతున్నారు. గత 15 సంవత్సరములుగా ఈ ఇబ్బంది పెట్టుకొని పలువురు వైద్యుల వద్దకు వెళ్లినా వయస్సు రీత్యా తగిన చికిత్స అందించడానికి వెనుకాడిన సందర్భాలు ఎదుర్కొన్నారు. ఇలా సుదీర్ఘకాలం నుండి భాదపడుతున్న ఈ వృద్దునికి మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్సను డా. వి కోటేశ్వర ప్రసాద్ గారి నేతృత్వంలోని శస్త్ర చికిత్స నిపుణుల బృందం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా కేవలం ఒక్క రోజులోనే ఆయను హాస్పిటల్ నుండి నడువ గలిగే స్థితిలో డిశ్చార్జి చేయడం జరిగింది. ప్రస్థుతం ఈ వృద్దుడు సాధారణ జీవనాన్ని సాగించడానికి సిద్దమవుతున్నారు.
ఇలా ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటునన రోగులకు స్వాంతన చేకూర్చిన వైనానికి సంబంధించిన వివరాలను నేడు రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డా. వి కోటేశ్వర ప్రసాద్ గారు వెల్లడించారు. చూడడానికి సాధారణమైన తుంటి ఎముక మార్పిడి లేదా మోకాలు కీళ్ల మార్పిడి అనిపించినా సుదీర్ఘ కాలంగా ఈ ఇబ్బందులతో భాద పడుతున్న వారికి స్వాంతన చేకూర్చగలగడం ఎన్నో సవాళ్లతో కూడిన అంశమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇందులో ఇతర వైద్య నిపుణుల సహాయం కూడా తీసుకొన్నామని దాంతో పాటూ అత్యంత తక్కువ ఖర్చుతో చికిత్స అందించాల్సి రావడం తాము ఎదుర్కొన్న మరో సవాల్ అని అన్నారు. ఖర్చు తగ్గించే క్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడకుండా చికిత్స అందించామని అంటూ అందుకు తాము ఎంతో ప్రణాళికబద్దంగా వ్యవహరించామని వివరించారు. ముఖ్యంగా ఎక్కువ కాలం హాస్పిటల్ లో ఉండే అవసరం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నామని తద్వారా హాస్పిటల్ యొక్క ఖర్చు కూడా తగ్గించగలిగామని చెప్పారు. తాము తీసుకొన్న ఈ చర్యలకు హాస్పిటల్ యాజమాన్యం కూడా సహకరించిందని, దీంతో అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించగలిగామని చెప్పారు. ముఖ్యంగా 21 సంవత్సరముల వయస్సు కలిగిన యువతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని తద్వారా ఆమె నాణ్యమైన జీవనాన్ని సాగించడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
ఈ మొత్తం ప్రయత్నంలో తాము సాధించిన విజయాల ద్వారా ప్రజలందరికీ చెప్పదలచుకొన్నదేమిటంటే ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా ఇబ్బందుల వలన ఎముకలు లేదా కీళ్ల లో లోపాలు తలెత్తినపుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్యులను సంప్రదిస్తే అత్యంత తక్కువ ఖర్చుతోనే ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులను దూరం చేసుకోవచ్చన్న విషయాన్ని గమనించారని డా. కోటేశ్వర ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలో హాస్పిటల్ యాజమాన్యాలు కూడా సహకరిస్తే నాణ్యతలో రాజీ పడకుండా మంచి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో చేయవచ్చని తాము నిరూపించామని ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ మంచి వైద్యాన్ని ప్రణళికతో అందించడం ముఖ్యం తప్ప పెద్ద హాస్పిటల్, ఎక్కువ ఖర్చు తో కూడిన వైద్యాన్ని అందిస్తేనే తగ్గుతుందనే అపోహ సరికాదని ఆయన వాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో రెనోవా లాంటి మధ్యతరహా హాస్పిటల్స్ లోకూడా నాణ్యమైన వైద్యం అందుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
అనంతరం శస్త్ర చికిత్స చేసుకొన్న యువతి మాట్లాడుతూ అసలు భవిష్యత్తంతా వికలాంగురాలిగా గడుపాల్సి వస్తుందనే ఆందోళనతో గడిపానని అయితే డా. వి కోటేశ్వర ప్రసాద్ గారు అందించిన వైద్యం, శస్త్ర చికిత్సతో తాను ఇపుడు ధైర్యంగా తన కాళ్ల మీద నడువగలుగుతున్నానని ఎంతో ఉద్వేగంతో వివరించారు. స్వయంగా మీడియా ముందు నడుస్తూ తన లాంటి వారికి మంచి వైద్యం అందుబాటులో ఉందని ధైర్యంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఎంతో ఖర్చు అవుతుందని తాము అనుకొన్నా తక్కువ ఖర్చుతో అతి స్వల్ప సమయంలో వైద్యులు తనను సాధారణ జీవనాన్ని సాగించేటట్లు చేయగలగడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
చివరగా కీళ్ల మార్పిడి చేయించుకొన్న వృద్దుడు మాట్లాడుతూ దశాబ్దకాలానికి పైగా తాను పడ్డ ఇబ్బందులు దూరం అయ్యాయని అందుకు వైద్యులు తీసుకొన్న జాగ్రత్తులు, అందించిన చికిత్సే కారణమని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
మీడియా సమావేశంలో డా వి కోటేశ్వర ప్రసాద్ తో పాటూ శస్త్ర చికిత్సలో పాల్గొన్న మరో వైద్యులు డా. పవన్ మురారి, కన్సల్టెంట్ ఆర్తోఫెడిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ వారితో పాటూ వైద్యం అందుకొన్న రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు.